మంచు విష్ణు సిబ్బంది మరోసారి వివాదంలో పడ్డారు. మోహన్ బాబు ఫామ్ హౌస్ ఉన్న జల్‌పల్లిలోని అడవిలో అడవి పందులను మంచు విష్ణు సిబ్బంది వేటాడారు. జల్ పల్లి అడవిలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దేవంద్రప్రసాద్ అడవి పందులను వేటాడారు.
ఆ వేటాడిన పందులను కట్టి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్, మంచు విష్ణు, మోహన్ బాబు మధ్య జరిగిన గొడవల్లో మంచు విష్ణు సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయ్యింది.