డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మంచు విష్ణు

భక్త కన్నప్ప తన డ్రీమ్ సినిమా అని హీరో మంచు విష్ణు ఎప్పటినుంచో చెబుతున్నారు. అప్పట్లో ఈ సినిమాకు సన్నాహాలు కూడా జరిగాయి. తనికెళ్ల భరణి దర్శకుడిగా ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు చేశారు. బడ్జెట్ ఎక్కువవుతుందనే కారణంగా ఆ సినిమాను ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు భక్త కన్నప్ప సినిమాను తిరిగి ప్రారంభించారు మంచు విష్ణు.

ఈ సినిమాకు భారీ సెటప్ చేసుకున్నారు మంచు విష్ణు. హీరోయిన్ గా నుపూర్ సనన్ ను తీసుకోవడమే కాదు మహాభారత్ సీరియల్ రూపొందించిన దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ను డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాత. పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఉంటుందని టీమ్ చెప్పుకుంటున్నారు. భక్త కన్నప్ప గొప్పదనం చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో ఈ సినిమా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.