మంచు మనోజ్ కూతురి నామకరణ వేడుక

పిల్లలకు చివర తండ్రి పేరు కలిసి వచ్చేలా పేర్లు పెడుతుంటారు. తల్లి పేరు కూడా కలిసి వచ్చేలా తన కూతురికి దేవసేన భూమా ఎంఎం (devasena Bhuma MM) అనే పేరు పెట్టాడు మంచు మనోజ్ (manchu manoj). మౌనిక (Bhuma mounika), మనోజ్ లకు ఇటీవల పాప పుట్టింది. తాజాగా ఈ పాప నామకరణ వేడుక జరిపారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచు మనోజ్ కూతురి నామకరణ వేడుక ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గతేడాది మనోజ్, మౌనిక ప్రేమ వివాహం చేసుకున్నారు. భూమా మౌనిక, మనోజ్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. భూమా మౌనికకు మొదటి భర్తతో ఒక కొడుకు ఉన్నాడు. కెరీర్ పరంగా చూస్తే మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. వాట్ ద ఫిష్ (What the fish) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రానుంది.