బాలీవుడ్ వెళ్తున్న “తంగలాన్” బ్యూటీ

ఇటీవల చియాన్ విక్రమ్(Chiyan vikram) తో కలిసి తంగలాన్(Thangalaan) సినిమాతో ఆకట్టుకున్న బ్యూటీ మాళవిక మోహనన్(Malvika maohanan)..ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. అక్కడ యుద్ర(Yudhra) అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. యుద్ర సినిమాను దర్శకుడు రవి ఉద్యవార్ రూపొందిస్తున్నారు.ఈ సినిమా పోస్టర్ ను షేర్ చేసిన మాళవిక మోహనన్..తను ఈ సినిమాలో నిఖత్ అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని ఆమె చెబుతోంది.

యుద్ర సినిమా ట్రైలర్ ఈ నెల 29న రిలీజ్ చేయబోతున్నారు. సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లోకి రానుంది. తెలుగులో ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న మాళవిక..మరోవైపు బాలీవుడ్ లోను యుద్ర సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అన్ని భాషల్లో స్టార్స్ తో నటిస్తున్న ఆమె కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉందని చెప్పుకోవచ్చు.