మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాపై రీసెంట్ గా నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పాటలే ఉండవని, మొత్తం రా అండ్ రస్టిక్ యాక్షన్ తో సినిమా ఉంటుందని ఆ న్యూస్ సారాంశం. ఈ న్యూస్ పై స్పందించారు నిర్మాత చెరుకూరి సుధాకర్. ఈ వార్తల్లో నిజం లేదని, సినిమా కోసం ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నామని, త్వరలోనే డీటెయిల్స్ వెల్లడిస్తామని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పాటలే ప్రత్యేక ఆకర్షణ అవుతుంటాయి. ఆ పాటలకు ఆయన చేసే డ్యాన్సుల కోసం అభిమానులు, మూవీ లవర్స్ వెయిట్ చేస్తుంటారు. అలాంటి స్టార్ సినిమాలో పాటలే ఉండవనేది ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ గా అంతా భఆవించారు. అయితే అలాంటిదేం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రొడక్షన్ లో హీరో నాని పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు.