రామ్ చరణ్ మూవీలో ధోని, క్లారిటీ ఇచ్చిన మేకర్స్

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీ నిరాశపరచడంతో ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడట చరణ్. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్‌ ఆట కూలీగా నటిస్తున్నాడనే వార్త లీకైంది. ఇందులో ఒక ఆట గురించి మాత్రమే కాదు అని.. క్రికెట్, కబడ్డీ, కుస్తీ.. ఇలా చాలా ఆటలు గురించి ఉంటుందని సమాచారం.

ఈ మూవీలో క్రికెటర్ ధోని నటిస్తున్నాడనే టాక్ ఆసక్తి కలిగిస్తోంది. అయితే ప్రచారంలో ఉన్న వార్త పై మేకర్స్ క్లారిటి ఇచ్చారు. ఈ సినిమాలో ధోని నటించడం అనేది రూమర్ అంటూ తేల్చేశారు. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చరణ్‌, శివ రాజ్ కుమార్, జాన్వీల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాని కుదిరితే దసరాకి.. లేకపోతే దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.