“కల్కి 2″లో మహేశ్ ఉండరు – నాగ్ అశ్విన్

కల్కి (Kalki 2898AD) సినిమాలో శ్రీకృష్ణుడి (Sri krishna) పాత్రలో మహేశ్ బాబు (Mahesh babu) ఉండాలని కోరుకుంటున్నారు సినీ ప్రియులు. మహేశ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని వైరల్ చేశారు. కల్కి రిలీజైన రెండు మూడు రోజులు ఈ సందడి నడిచింది. ఇవాళ జరిగిన కల్కి ప్రెస్ మీట్ లో కల్కి 2 లో మహేశ్ బాబు ఉంటాడా ఉండడా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag ashwin).

కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రను అలా డార్క్ షేడ్ లోనే చూపించాలని అనుకున్నామని, మహేశ్ ను శ్రీకృష్ణుడిగా చూపించే అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానని నాగ్ అశ్విన్ అన్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది కల్కి సినిమా. 800 కోట్ల రూపాయల రికార్డ్ స్థాయి వసూళ్లకు రీచ్ అవుతోంది కల్కి.