గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాగా ప్రచారంలో ఉన్న సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం షూటింగ్ కి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన ఈ చిత్రాన్ని ప్రారంభించారో కానీ.. షూటింగ్ కి బ్రేకులు పడుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని తప్పించారని ప్రచారం జరుగుతుంది. ఖుషి సినిమా సంగీత దర్శకుడు అబ్థుల్ వాహిబ్ తీసుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి.
ఆతర్వాత అబ్ధుల్ వాహిబ్ కాదు.. యువ సంగీత దర్శకుడు భీమ్స్ తో శాంపిల్ గా ఓ పాట చేయించారు. అది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకు రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా టాక్ విపించింది. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే తాజా వార్త ఏంటంటే.. థమన్ తోనే చేయించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. తాజాగా త్రివిక్రమ్ గుంటూరు కారం పాటల పని మీదకు వచ్చారని, మార్నింగ్ 7 నుంచి 10 వరకు పాటల పని మీద డిస్కషన్లు సాగించే పని ప్రారంభించారని సమాచారం.
ఈ సినిమాలో అయిదు మెయిన్ సాంగ్స్, రెండు మూడు బిట్ సాంగ్స్ వుంటాయట. ఈ పాటలు అన్నీ ఒక్కో నెలలో ఒక్కటి వంతున జనవరి విడుదల తేదీ లోగా రిలీజ్ చేస్తారట. పాటలు రెడీ కాక, పాట షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చారు. ఆగస్టు 2 లేదా 3 నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయాలని అనుకుంటున్నారట. దీనికి హీరో మహేష్ బాబు అవసరం లేదు. అయితే ఇప్పుడు మనసు మార్చుకుని, పాట చిత్రీకరణకే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి గుంటూరు కారం మళ్లీ సెట్స్ పైకి వస్తుంది. మరి.. ఇకనుంచైనా బ్రేకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటాదేమో చూడాలి.