“దేవర” ఫంక్షన్ కు గెస్ట్ గా మహేశ్

ఎన్టీఆర్(NTR) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర(Devara) గ్రాండ్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా సాంగ్స్ తోపాటు ఇతర ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) వస్తున్నారు. ఒకే వేదిక మీద మహేశ్, ఎన్టీఆర్ ను ప్రేక్షకులు మరోసారి చూడబోతున్నారు.

మహేశ్ బాబు కొరటాల శివ(Koratala siva)తో రూపొందించిన భరత్ అనే నేను ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర మూవీ ఫంక్షన్ కు మహేశ్ వస్తున్నారు. మహేశ్, ఎన్టీఆర్ ఆ మధ్య టీవీ ప్రోగ్రామ్ లో చేసిన సందడి అభిమానులు మర్చిపోలేదు. దేవర వేదిక మీద కూడా మహేశ్, ఎన్టీఆర్ కనిపించడం కూడా గుర్తుండిపోయే సందర్భం కానుంది.