బాహుబలి సినిమా ఒప్పుకున్న తర్వాత ప్రభాస్ ఆ సినిమాకు రెండేళ్లు డేట్స్ ఇచ్చాడు. కానీ ఆ డేట్స్ చాలవని ప్రభాస్ కు తెలుసు. అందుకే బాహుబలి ప్రీ ప్రొడక్షన్ టైమ్ లో త్వరగా ఓ మూవీ చేసేశాడు. అదే మిర్చి సినిమా. కొత్త దర్శకుడు కొరటాల శివను పరిచయం చేస్తూ ప్రభాస్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఆ ఖాలీ టైమ్ ను అలా ప్రభాస్ యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వాలని మహేశ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజమౌళితో మహేశ్ చేసే సినిమా వచ్చే ఏడాది చివరి కల్లా స్టార్ట్ కాదు. ఈ లోగా గుంటూరు కారం సంక్రాంతికి రిలీజై మహేశ్ ఖాలీగా ఉంటాడు. టైమ్ వేస్ట్ ఎందుకుని ఈలోగా మహేశ్ మరో ప్రాజెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడ. ఆరు నెలల డేట్స్ లో ఓ సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది తేలాల్సిఉంది. ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యేసరికి సిద్ధంగా ఉండాలనుకుంటున్నాడు. మహేశ్ చేసే ఈ క్విక్ మూవీకి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది.