ప్రభాస్ పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలు- లేఖ రాసిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు

కల్కి సినిమాలో ప్రభాస్(Prabhas) క్యారెక్టర్ లో హీరోయిజం లేదంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ(Arshad warsee) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు లేఖ రాశారు. ప్రభాస్ గౌరవాన్ని తగ్గించేలా అర్షద్ వార్సీ మాట్లాడారని, నటులు పరస్పరం గౌరవించుకోవాలని, వివాదాస్పదంగా మారే ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా చూసుకోవాలని లేఖలో మంచు విష్ణు(Manchu vishnu) పేర్కొన్నారు.

హీరో నాని(Hero nani) కూడా అర్షద్ వార్సీ ఇష్యూలో స్పందించారు. నటులుగా గొప్ప స్థాయిలో ఉన్న నటులు ఎవరైనా ఆచితూచి మాట్లాడాలని నాని అన్నారు. మాటల్లో ఏమాత్రం తేడా ఉన్నా ఇప్పుడున్న సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుందని నాని అభిప్రాయపడ్డారు. ప్రభాస్ కు మద్ధతుగా, అర్షద్ వార్సీని విమర్శిస్తూ ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రముఖులు స్పందించారు.