దసరాకు “వేట్టయాన్”, రిలీజ్ డేట్ కన్ఫర్మ్

రజనీకాంత్ (Rajnikanth) హీరోగా నటిస్తున్న వేట్టయాన్ (vettayaan) సినిమా దసరా రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది. అక్టోబర్ 10న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 10న వేట్టయాన్ ఉంటుందనే రూమర్స్ గతంలోనే వచ్చినా తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు.

ఈ చిత్రాన్ని జై భీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ (TG Jnanavel) రూపొందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ (Amitab bachan) ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca productions) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వేట్టైయాన్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.