నెట్ ఫ్లిక్స్ లో “లక్కీ భాస్కర్” రికార్డ్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వరుసగా 13 వారాల పాటు ట్రెండింగ్ లో ఉన్న మొదటి సౌత్ ఇండియన్ మూవీగా లక్కీ భాస్కర్ నిలిచింది. ఈ రేర్ ఫీట్ ను మూవీ టీమ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ లో ఫస్ట్ వీక్ 15 దేశాలలో లక్కీ భాస్కర్ టాప్ 10లో ట్రెండ్ అయ్యింది.

అలాగే ఈ సినిమాకు 17.8 బిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కాయి. ఒక తెలుగు మూవీ ఇంటర్నేషనల్ గా ఇంత భారీ వ్యూస్ సాధించడం కూడా విశేషమే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాను రూపొందించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. గత దీపావళి పండక్కి లక్కీ భాస్కర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.