అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన “లవ్ రెడ్డి” సినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రాగా..ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఆదరణ దక్కుతోంది. అమోజాన్ ప్రైమ్ వీడియోలో “లవ్ రెడ్డి” సినిమా టాప్ లో ట్రెండ్ అవుతోంది. నేషనల్ వైడ్ తమ మూవీ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతుండటంతో మూవీ టీమ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రముఖ ఓటీటీ ఆహాలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
“లవ్ రెడ్డి” సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరించారు. గతేడాది అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ అయ్యింది.