పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే.. ఈ క్రేజీ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా ఇంట్రెస్టింగ్ న్యూస్..
పుష్ప 2 షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. అయితే.. రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఐటం సాంగ్ అయితే.. రెండోది బన్నీ, శ్రీలీల పై చిత్రీకరించాల్సిన పాట. ఈ వారంలోనే ఐటం సాంగ్ షూట్ చేయనున్నారని తెలిసింది. అయితే.. మరో పాటను ఇప్పుడు చిత్రీకరించాలా.? వద్దా? అని ఆలోచినస్తున్నారటన మేకర్స్. కారణం ఏంటంటే.. ఈ పాట వల్ల సినిమా లెంగ్త్ పెరుగుతోందే తప్పా కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదని టీమ్ భావిస్తోందని తెలిసింది.
డిసెంబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి పెద్దగా టైమ్ లేదు. ఇలాంటప్పుడు ఆ సాంగ్ పై ఫోకస్ చేయడం కంటే, పూర్తిగా పక్కన పెడితే టైమ్ తో పాటు, ఖర్చు కూడా కలిసొస్తుందని సుకుమార్ భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐటెమ్ సాంగ్ కంప్లీట్ అయ్యాకా… టైమ్ ను బట్టి, ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలిసింది. అలా జరిగితే.. ఆడియోలో ఉండే పాట, సినిమాలో కనిపించకపోవొచ్చు అని తెలిసింది. ఇటీవల దేవర సినిమా విషయంలో ఇదే జరిగింది. దావుదీ పాటని షూట్ చేశారు కానీ.. సినిమా లెంగ్త్ లో అది సెట్ కాలేదు. దాంతో ఆ పాట లేకుండానే సినిమాని విడుదల చేశారు. టైమ్ తో పాటు డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఈ పాట విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఈ వారంలో ఈ పాటపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.