“లైలా”ను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు

విశ్వక్ సేన్ లైలాగా లేడీ గెటప్ లో నటిస్తున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. అయితే.. విశ్వక్ కంటే ముందు ఈ స్టోరీను నలుగురు హీరోల దగ్గరకు తీసుకొని వెళ్లినట్లుగా షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి తెలియచేశారు. లేడీ క్యారక్టర్ చేయగలుగుతామో లేదో అనే భయంతో ఈ చిత్రాన్ని ఆ నలుగురు హీరోలు రిజెక్ట్ చేసారని, కానీ విశ్వక్ మాత్రం ఖచ్చితంగా ఈ పాత్ర చేస్తానని ముందుకు వచ్చాడన్నారు. ఇకపోతే లేడీ గెటప్‌లో తన తండ్రి కూడా గుర్తు పట్టలేకపోయాడని విశ్వక్‌ సేన్‌ చెప్పారు.

లైలా మూవీని రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోలు ఎవరు అనేది బయటపెట్టలేదు కానీ.. రిజెస్ట్ చేసిన విషయాన్ని మాత్రం ప్రొడ్యూసర్ బయటపెట్టారు. దీంతో ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిన ఆ నలుగురు కరెక్టా..? లేక ఈ మూవీ కథ నమ్మి చేసిన విశ్వక్ కరెక్టా..? అనేది ఆసక్తిగా మారింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈసారి మీకు లైలా వుంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే.. మీకు సోను మోడల్ ఉన్నాడు. లైలా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని విశ్వక్ సేన్ కాన్ఫిడెన్స్ తో చెప్పడంతో మరింతగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి.. విశ్వక్ నమ్మకాన్ని లైలా ఎంత వరకు నిజం చేస్తుందో చూడాలి.