ఆస్కార్ 2025(Oscars 2025) బరిలో నిలిచింది బాలీవుడ్ మూవీ లాపతా లేడీస్(Lapataa ladies). ఆమిర్ ఖాన్(Aamir khan) మాజీ భార్య కిరణ్ రావ్(Kiran rao) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆస్కార్ లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో లాపతా లేడీస్ మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 29 సినిమాలను షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి లాపతా లేడీస్ ను ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీగా సెలెక్ట్ చేసింది.
వచ్చే ఏడాది మార్చి 3న లాస్ ఏంజెలీస్ లో ఆస్కార్ అవార్డ్ ల ప్రధానోత్సవం జరగనుంది. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మించారు. లాపతా లేడీస్ సినిమా ఆస్కార్ ఎంట్రీగా వెళ్తుందని గతంలోనే కిరణ్ రావ్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమ టీమ్ పెట్టుకున్న నమ్మకం నిజమైందని ఈ సందర్భంగా కిరణ్ రావ్ స్పందించారు. లాపతా లేడీస్ టొరంటో ఫిలి ఫెస్టివల్, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ వంటి చిత్రోత్సవాల్లో పురస్కారాలు గెల్చుకుంది.