బుక్ మై షో లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “ఖుషి”

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రీ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో 130కె ఇంట్రెస్ట్ లతో ఖుషి టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఏర్పడిన క్రేజ్ కు బుక్ మై షో ఇంట్రెస్ట్ లు ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాయి. ఖుషి పాటలు హిట్టవడం, ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో ఖుషి మీద మంచి బజ్ ఏర్పడింది. మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్ అవడం కూడా సినిమా ప్రమోషన్ కు ఊపు తీసుకొచ్చింది.

ఖుషి సినిమా కోసం సమంత, విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా సమంతతో విజయ్ చేసిన వీడియో కాల్ కూడా ఆడియెన్స్ అటెన్షన్ రాబట్టింది. సినిమా సక్సెస్ పై ఖుషి టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమ సంస్థకు ఈ సినిమా మరో సూపర్ హిట్ తెస్తుందని మైత్రీ ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. ప్రేమ, కుటుంబ కథాంశంతో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైజ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.