“ఖుషి” నా డ్రీమ్ మూవీ – ఫ్యాన్స్ ఇంటరాక్షన్ లో హీరో విజయ్ దేవరకొండ

తన కొత్త సినిమా ఖుషి ప్రచారంలో భాగంగా నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. ఫ్యాన్స్ తో జరిపిన ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు, జీవితాన్ని తాను చూసే పర్సెప్షన్ గురించి డీటెయిల్డ్ గా చెప్పారు విజయ్. ఈ లైవ్ ఇంటర్వ్యూలో ఖుషి హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్ రవిశంకర్, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఖుషి జర్నీ గురించి మాట్లాడారు.

ఖుషి సినిమాలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. ఈ సినిమాకు సమంత, శివ నిర్వాణ వంటి మంచి టీమ్ దొరికింది. వీళ్లంతా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తారు. అలా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తే సెట్ లో ఇబ్బందే ఉండదు. ఈ సినిమా ఫస్టాఫ్ లో నేను లవర్ బాయ్ లా కనిపిస్తా. ఆ తర్వాత మ్యారీడ్ బాయ్ గా కనిపిస్తా. నేను ఇప్పటిదాకా హజ్బెండ్ క్యారెక్టర్ చేయలేదు. ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో సాగే సినిమా ఖుషి. ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం.

సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు,లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా.

నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటా. మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఆ స్క్రిప్ట్స్ ఆకట్టుకునేలా రాయడం కష్టం. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు చేసిన ఖుషి, తర్వాత చేస్తున్న వీడీ 12, వీడీ 13 సినిమాలకు సూపర్బ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నా మూవీ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడనేది మాత్రం చెప్పలేను. గ్లాడియేటర్ నా ఫేవరేట్ మూవీ. పోకిరి సినిమాలో మహేశ్ ఇంట్రడక్షన్ సీన్ ఇష్టం. అలాంటి ఇంట్రో నా మూవీలో ఒకటి పెట్టుకోవాలి. అదెప్పుడు కుదురుతుందో చూడాలి.

నిర్మాత వై రవి శంకర్ మాట్లాడుతూ – ఖుషి సినిమా ఔట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ అవుతుంది. విజయ్ తో డియర్ కామ్రేడ్, ఖుషి చేశాం. మూడో సినిమా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వాళ్లిద్దరి కాంబో అయితే ఎలాంటి ఫైర్ ఉంటదో మీకు తెలుసు. అన్నారు. సమంత మాట్లాడుతూ – ఖుషి మూవీని యూఎస్ లో అభిమానుల మధ్య చూడబోతున్నాను. ఇలా నా మూవీని యూఎస్ లో చూడటం ఇదే తొలిసారి. ఇక్కడ ఫ్యాన్స్ ఎంతో లవ్ చూపిస్తున్నారు.అని చెప్పింది. శివ నిర్వాణ మాట్లాడుతూ – అర్జున్ రెడ్డి సినిమా చూశాక విజయ్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ తో పనిచేయాలని అనుకున్నా. ఖుషి కథ చెప్పాక..సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ పట్టింది. ఆ గ్యాప్ లో కుదిరినప్పుడు కలుస్తుండేవాళ్లం. ఎప్పుడూ ఖుషి కథ గురించి డిస్కస్ చేసేవాడిని. ఎలాగైనా ఈ సినిమా చేయాలనే కోరిక ఉండేది. విజయ్ ని ఫస్ట్ డే సెట్స్ లో చూసినప్పుడు డ్రీమ్ కమ్ ట్రూ అనే ఫీలింగ్ వచ్చింది. అన్నారు.