వైజాగ్ లో ఘనంగా “ఖుషి” బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకుంది. ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – మా సంస్థకు ఖుషి లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చిన విజయ్, సమంత, శివ అందరికీ థ్యాంక్స్. మణిరత్నం రోజా లాంటి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను నిర్మించినందుకు గర్వంగా ఉంది. ఖుషికి ఫస్ట్ త్రీ డేస్ లోనే 75 పర్సెంట్ రికవరీ అయ్యిందంటే మామూలు విషయం కాదు. విజయ్ కెరీర్ లో ఇది హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందని అనుకుంటున్నాం. అన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ – ఖుషి లాంటి మంచి సినిమాను రూపొందించినందుకు సంతోషంగా ఉంది. నేను కావాలంటే ఈ సినిమాలో ఫైట్స్, ఐటెంసాంగ్స్ పెట్టొచ్చు. కానీ ఓ క్లీన్ మూవీ, పర్పస్ ఫుల్ మూవీ చేయాలనుకున్నా. మన కుటుంబంలో మనకెన్ని అభిప్రాయ బేధాలైనా ఉండొచ్చు..కానీ మనమంతా ఒక కుటుంబం. మన ఆలోచనలు, నమ్మకాలు వేరైనా..కలిసి ఉండేందుకు అవి అడ్డు కాకూడదు అనే మంచి విషయాన్ని ఖుషిలో చెప్పాను. త్వరలో పుష్ప 2, సలార్ వంటి యాక్షన్ మూవీస్ వచ్చి మిమ్మల్ని ఆకట్టుకోవచ్చు. అలాంటి యాక్షన్ మూవీస్ మధ్య మన ఖుషి ఆహ్లాదకరమైన ఒక చిరుజల్లు లాంటిది. అని అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా. మీరు ఖుషి అయితే నేను ఫుల్ ఖుషీ. ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మీ మొహల్లో సంతోషం చూడాలని అనుకున్నా. ఇవాళ ఆ హ్యాపీనెస్ చూస్తున్నా. మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది. ఖుషి ఒక సింపుల్, క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరి. సినిమా చేసేప్పుడు శివ కూడా ఇదే మాట చెప్పాడు. విజయ్ బ్రో మనం ఒక క్యూట్ లవ్ స్టోరిని ఒక మంచి పాయింట్ చెబుతూ ఫ్యామిలీస్ హాయిగా చూసేలా చేద్దామని అనేవాడు. ఇవాళ సినిమాకు మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది. నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు, నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. అన్నారు.