“కుబేర” కోసం సమ్మర్ వరకు ఆగాల్సిందే..!

ధనుష్, నాగార్జున, రశ్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీగా కుబేరపై మూవీ లవర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుంచి క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ.. నాగ్, ధనుష్‌, రష్మిక లుక్స్ రిలీజ్ చేశారు. ఈ త్రి క్యారెక్టర్స్ కు సంబంధించిన రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా పై మరింత క్రేజ్ ను పెంచాశాయి.

ధనుష్ బిచ్చగాడిగా కనిపించడం, ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. డెప్త్ ఉన్న కథలు, పర్పస్ ఉన్న స్టోరీస్ తెరకెక్కించే శేఖర్ కమ్ముల..కుబేరతో సర్ ప్రైజ్ చేయబోతున్నారనే హైప్ ఏర్పడుతోంది. ఈ క్రేజీ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫిబ్రవరిలో కుబేర రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. త్వరలోనే కుబేర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ సినిమా చూసేందుకు సమ్మర్ వరకు ఆగాల్సిందే.