“కుబేర” రిలీజ్ డేట్ ఫిక్స్

నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ఈ చిత్రంలో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ముంబై ధారావి నేపథ్యంగా సాగే కుబేర చిత్రంలో ధనుష్ బెగ్గర్ గా నటించడం విశేషం.

కుబేర సినిమాపై కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. సక్సెస్ ఫుల్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేరతో మరో కొత్త ప్రయత్నం చేసి ఉంటాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి.