ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది కృతి శెట్టి. ఆతర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించడంతో ఈ అమ్మడుకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ఇటీవల కాలంలో కృతి నటించిన సినిమాలు మెప్పించలేకపోయినా.. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే.. ఈమధ్య కాలంలో కృతి పై పుకార్లు ఎక్కువ అయ్యాయి. తాజాగా కృతి శెట్టిని ఓ స్టార్ హీరో కొడుకు వేధిస్తున్నాడని.. ఆమె ఎక్కడుంటే అక్కడకి వెళుతున్నాడని.. ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
అంతే కాకుండా ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో చెప్పిందని పుకారు షికారు చేస్తోంది. ఈ పుకారు అలా అలా వెళ్లి కృతికి చేరింది అనుకుంట.. దీని పై ఈ అమ్మడు స్పందించింది. ఆ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి కథనాలు కల్పించడం ఆపాలని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయద్దని కోరంది. ఈ ఇండస్ట్రీలో గ్యాసిప్స్ కామన్ అని పట్టించుకోలేదని.. కానీ రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో క్లారిటీ ఇచ్చానని చెప్పింది. మరి.. ఇక నుంచైనా కృతి పై పుకార్లు తగ్గుతాయేమో చూడాలి.
— KrithiShetty (@IamKrithiShetty) July 6, 2023