రూటు మార్చిన కృతి శెట్టి

కృతి శెట్టి(Kriti shetty) ఉప్పెన(Uppena) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుసగా అవకాశాలు అందుకుంది. ఇంకా చెప్పాలంటే.. తక్కువ టైమ్ లోనే టాప్ ప్లేస్ కి దూసుకొచ్చింది. అయితే.. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వరుస ఫ్లాపులు రావడంతో ఆఫర్స్ తగ్గాయి. దీంతో సహజంగానే మార్కెట్ మీద ప్రభావం పడింది. శర్వానంద్ తో నటించిన మనమే చిత్రంతో మళ్ళీ ట్రాక్ లో రావచ్చని కాన్ఫిడెన్స్ కృతి శెట్టిలో బలంగా ఉండేది కానీ ఈ సినిమా మరీ బ్యాడ్ అనిపించుకోలేదు కానీ మనమే అంచనాలు పూర్తిగా అందుకోలేదన్నది వాస్తవం.

మనమే(Maname) ద్వారా కృతి శెట్టి జరిగిన మేలు పెద్దగా లేదనే చెప్పాలి. అందుకనే బేబమ్మ ఇప్పుడు రూటు మార్చి ఫోకస్ అంతా కోలీవుడ్, మాలీవుడ్ పై పెట్టాలి అనుకుంటుంది. కోలీవుడ్ లో కస్టడీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ అవకాశలు వస్తున్నాయి. లేటెస్ట్ గా మలయాళంలో రైజింగ్ స్టార్లలో ఒకడైన టొవినో థామస్(Tovino thomas) కు జంటగా ఏఆర్ఎం(ARM) సినిమాలో నటించింది. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. వేరే భాషల్లో పెద్దగా ఆడలేదు కానీ.. మలయాళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వీకెండ్లోనే 50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. స్ట్రాంగ్ రన్ తో నడుస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న కృతికి ఈ సినిమా ఊరట కలిగించింది. ఈ సినిమాలో తన పాత్ర కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో మలయాళంలో ఆఫర్స్ వస్తున్నాయట. ఈ మూవీని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. బేబమ్మ రూటు మార్చింది. సక్సెస్ సాధించింది. తెలుగులో కూడా బిజీ అవుతుందేమో చూడాలి.