ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా దేవరలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ కృతి సనన్ ను సంప్రదిస్తున్నారట. ఈ పాటకు కృతి స్టెప్పులు వేస్తే అదిరిపోతాయని టీమ్ భావిస్తున్నారు. డ్యాన్సుల్లో స్పెషలిస్ట్ అయిన ఎన్టీఆర్ తో కృతి జోడీ ఈ పాటకు బాగుంటుందని అనుకుంటున్నారు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఓ పాటలో మెరిసేందుకు కృతికి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక తెలుగు హీరోలను బాలీవుడ్ తారలు బాగా ఇష్టపడుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కు హిందీ సినిమా పరిశ్రమ నుంచి సెలబ్రిటీలు చాలా మంది అప్రిషియేట్ చేస్తూ స్పందించారు. వారిలో కృతి సనన్ కూడా ఉంది.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కృతి సనన్ కూడా జాయిన్ అవడంతో గ్లామర్ రెట్టింపు ఖాయమని అనుకోవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దేవర ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.