రాజకీయాల్లకి కోలీవుడ్ స్టార్ విజయ్..?

కోలీవుడ్ స్టార్ విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ లియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్.. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో మూవీ చేయనున్నాడు. ఇటీవల ఈ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే.. వెంకట్ ప్రభుతో విజయ్ చేసే సినిమానే లాస్ట్ సినిమా అని.. ఆతర్వాత ఇక సినిమాలు చేయరని.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.

ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రవేశం గురించి కాస్త సీరియస్ గానే ఉన్నాడని.. ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని టాక్ వినిపిస్తుంది. విజయ్ రాజకీయ ప్రవేశం గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ.. విజయ్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో తమిళనాడులో విజయ్ రాజకీయాల్లోకి వస్తే.. ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఆసక్తిగా మారింది. అలాగే ఇటీవల కాలంలో విజయ్ రాజకీయాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కమల్ రాజకీయాల్లోకి వచ్చారు కానీ.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. మరి.. విజయ్ కనుక రాజకీయాల్లోకి వస్తే.. ఏం జరగనుందో చూడాలి.