కిరణ్ అబ్బవరం “క” సినిమా మలయాళ రైట్స్ సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్

తన కెరీర్ లో మరొక మంచి బ్రేక్ నిచ్చే సినిమా కోసం వేచి చూస్తున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram). ఆయన వెయిటింగ్ “క”(KA) సినిమాతో తీరుతోంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేయగా..టీజర్ లో కనిపించిన గ్రాండ్ మేకింగ్, విజువల్ బ్యూటీ, మూవీ బ్యాక్ డ్రాప్ ఆకట్టుకున్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో “క” సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

తాజాగా “క” సినిమా సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulqar salman) ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్(Wayfarer films) సొంతం చేసుకుంది. మలయాళంలో “క” సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. “క” సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్ తమ వేఫరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. స్ట్రాంగ్ కంటెంట్ తో “క” సినిమా ఈ క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది. ఇదే క్రమంలో త్వరలోనే తమిళ, కన్నడతో పాటు ఇతర భాషల బిజినెస్ క్లోజ్ కానుంది. “క” సినిమా చాలా బాగా వచ్చిందని మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

“క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.