ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతోంది కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” సినిమా. ఈ మూవీ కోసం కొత్త కాంటెస్ట్ అనౌన్స్ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. “దిల్ రూబా” కథేంటో ఊహించి చెప్పిన వారికి ఈ సినిమాలో తాను వాడిన బైక్ ను గిఫ్ట్ గా ఇస్తానంటూ ప్రకటించారు.
స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ బైక్ సొంతం చేసుకోవాలనుకునేవారు మేల్ ఫీమేల్ ఎవరైనా “దిల్ రూబా” కథను గెస్ చేయాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విన్నర్ ను అనౌన్స్ చేస్తారు. అలాగే “దిల్ రూబా” సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు విన్నర్ తో కలిసి కిరణ్ అబ్బవరం థియేటర్ కు ఇదే బైక్ పై వెళ్లబోతున్నారు. హీరో కిరణ్ అబ్బవరం స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసిన ఈ కాంటెస్ట్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది.