నా పనైపోయిందని అనుకోవడం తప్పు – “క” టీజర్ లాంఛ్ లో హీరో కిరణ్ అబ్బవరం

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” (KA). నయన్ సారిక (Nayan sarika), తన్వీ రామ్ (Tanvi ram) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ (Sujeeth sandeep) విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. “క” సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – వీడి పని అయిపోయింది అని ఎవరైనా అంటే నమ్మకండి. ఎందుకంటే మన పని అయిందా కాదా అనేది మనకు మాత్రమే తెలుసు. నా పని అయిపోయిందా లేదా అనేది నాకు మాత్రమే తెలుసు. నా పని అయిపోయింది అనిపించినప్పుడు సినిమాలు చేయను. నేను చాలా మంచి సినిమాలు చేస్తాను. నన్ను ప్రేమించిన మీ అందరి కోసం చేస్తాను. ఏ యంగ్ యాక్టర్ కు ఇవ్వనంత లవ్ నాకు మీరంతా ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతాను. మా టీమ్ అంతా “క” సినిమాకు నేను పడిన కష్టాన్ని చెప్పారు. “క” సినిమా తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని మీరంతా చెప్పుకుంటారు. “క” అంటే కంటెంట్. ఆ కంటెంట్ ను మా డైరెక్టర్స్ డిజైన్ చేశారు. ఇవాళ మా టీమ్ అంతా హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే కారణం మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు. ఇప్పుడు “క” ఫుటేజ్ చూసి బాగుంది అంటున్నాం గానీ మా ప్రొడ్యూసర్ గారు కథ విన్నప్పుడే సినిమా మీద నమ్మకం ఉంచారు. “క” తో ఒక మంచి మూవీ మీకు ఇవ్వబోతున్నా.అన్నారు.