హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. కిరణ్, రహస్య కుటుంబంలోకి ఓ బిడ్డ రాబోతున్నాడు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. రహస్యతో తీసుకున్న ఫొటోనూ పోస్ట్ చేస్తూ.. మా ప్రేమ పెరుగుతోంది అంటూ ఆయన క్యాప్షన్ రాశారు. కిరణ్, రహస్య దంపతులకు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.
రాజావారు రాణిగారు చిత్రంలో కలిసి నటించిన రహస్య, కిరణ్ అబ్బవరం తొలి మూవీ నుంచే ప్రేమించుకున్నారు. గతేడాది ఆగస్టులో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.