ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది…!

అనౌన్స్ మెంట్ నుంచే అటు ట్రేడ్ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తిరేపిన సినిమా “క” (KA). కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) హీరోగా నటిస్తున్న ఈ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా త్వరలో పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ రోజు “క” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ (World of vasudev) ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం పోషించిన వాసుదేవ్ పాత్ర ఎలా ఉండబోతుందో చూపించింది.

‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాటలో నిన్న మొన్న ఉన్న నన్ను చూశారా..వెన్ను దన్ను అంటూ ఏముంది. ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది…’ అనే లైన్స్ హీరో వాసుదేవ్ క్యారెక్టర్ కు ఊరితో ఎలాంటి అనుబంధం ఉందో తెలియజేస్తున్నాయి. “క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు.