హీరో కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఔట్ పుట్ మరింత క్వాలిటీగా ఇచ్చేందుకు ఇంకొంత టైమ్ కావాల్సి ఉండటంతో “దిల్ రూబా” రిలీజ్ ను వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని వారు తెలిపారు. ఫ్రెష్ లవ్ స్టోరీతో వస్తున్న “దిల్ రూబా” సినిమా మీద యూత్ ఆడియెన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
“దిల్ రూబా” సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.