హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్ డమ్” సినిమా టీజర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 29 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ఈ టీజర్ ట్రెండ్ అవుతోంది. “కింగ్ డమ్” సినిమా మీద ఆడియెన్స్ కు ఉన్న క్రేజ్ ను ఈ రేంజ్ లో వస్తున్న రెస్పాన్స్ ప్రూవ్ చేస్తోంది.
“కింగ్ డమ్” టీజర్ లోని ఎమోషన్, యాక్షన్, డ్రామా, విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, ఎన్టీఆర్, సూర్య, రణ్ బీర్ ఇచ్చిన వాయిస్ ఈ స్థాయిలో రీచ్ అయ్యేందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో “కింగ్ డమ్” టీజర్ సందడి చేస్తోంది. ఈ సినిమాను డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందించారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. మే 30న “కింగ్ డమ్” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.