“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు పూర్వాజ్. ఆయన హీరోగా మారి తన దర్శకత్వంలో రూపొందిస్తున్న మూవీ కిల్లర్. ఈ సినిమాను ఎప్పటిలాగే నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో జెట్ స్పీడ్ తో తెరకెక్కిస్తున్నారు పూర్వాజ్. ప్రస్తుతం మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసి 50 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్ కు మూవీ టీమ్ రెడీ అవుతోంది.
కిల్లర్ సినిమాలో జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లింగ్ రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, అంశాలతో కిల్లర్ మూవీ ఆడియెన్స్ కు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుంది.