హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన క్రేజీ లైనప్ లో ముందుగా కింగ్ డమ్ సినిమా ఉండగా…నెక్ట్స్ రౌడీ జనార్థన ఉంది. ఈ చిత్రాన్ని రాజా వారు రాణి గారు డైరెక్టర్ రవి కిరణ్ కోలా రూపొందిస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రౌడీ జనార్థన సినిమాలో విజయ్ కు జంటగా కీర్తి సురేష్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ కు జంటగా రుక్మిణి వసంత్ అనుకున్నప్పటికీ.. కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారని సమాచారం. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాని సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది. భారీ పాన్ ఇండియా మూవీగా రౌడీ జనార్థన ప్రేక్షకుల ముందుకు రానుంది.