అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమా నిరాశపరచడంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తదుపరి చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్ లో చేయనున్నాడు. గతంలో చైతూ, చందూ కలిసి ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేశారు. ఈ రెండింటిలో ప్రేమమ్ సక్సెస్ కాగా, సవ్యసాచి చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఓ విభిన్న ప్రేమకథా చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుందట. ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. గతంలో చైతన్య, కీర్తి సురేష్ కలిసి మహానటి సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు. చైతన్య అక్కినేని పాత్రను, కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించారు. ఇప్పుడు మరోసారి కలిసి నటించనున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. జులై నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.