స్టార్ హీరోయిన్స్ మధ్య క్యాట్ ఫైట్ గురించి వింటుంటాం. కానీ ఇప్పుడున్న హీరోయిన్స్ మధ్య అలాంటివి దాదాపుగా తగ్గిపోయాయి. చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. మొన్న శ్రీలీల, రశ్మికను పుష్ప 2 స్టేజ్ మీద ఎంతో ఫ్రెండ్లీగా ఉండటం మూవీ లవర్స్ చూశారు. ఇప్పుడు సమంత, కీర్తి సురేష్ కూడా అలాంటి స్నేహాన్ని ప్రదర్శిస్తున్నారు. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ బేబీ జాన్ రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సమంతకు థ్యాంక్స్ చెప్పింది కీర్తి సురేష్.
సమంత సజెస్ట్ చేయడం వల్లే తనను బేబీ జాన్ సినిమాలో తీసుకున్నారని కీర్తి తెలిపింది. సమంత, విజయ్ జంటగా నటించిన తమిళ సినిమా తెరి ని హిందీలో బేబీ జాన్ గా రీమేక్ చేశారు. తెరిలో సమంత హీరోయిన్. ఆమె క్యారెక్టర్ ను హిందీ వెర్షన్ లో కీర్తి చేసింది. కీర్తి సురేష్ అయితేనే తను చేసిన క్యారెక్టర్ కు బాగుంటుందని సమంత చెప్పింది. తాను ఈ క్యారెక్టర్ చేయగలను అంటూ సమంత ఎంకరేజ్ చేసిందని కీర్తి గుర్తుచేసుకుంది.