నాని ప్రస్తుతం హిట్ 3 అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి శైలేష్ కొలను డైరెక్టర్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ వయలెంట్ గా ఉందన్న టాక్ తెచ్చుకుంది. నాని మూవీస్ కు ఇంత హింస సెట్ కాదనే విమర్శలూ వచ్చాయి. ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. హిట్, హిట్ 2 సక్సెస్ అవ్వడంతో హిట్ 3 పై పాజిటివ్ బజ్ ఉంది.
ఈ సినిమాలో నాని నటించే అర్జున్ సర్కార్ పాత్ర ఎలాంటి జాలి, దయ లేని ఓ పోలీస్ ఆఫీసర్‌గా మనకు చూపించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కేమియో కూడా ఉండబోతుందని.. ఆ పాత్రను కోలీవుడ్ స్టార్ కార్తీ చేయబోతున్నారని టాక్. ఆ పాత్ర హిట్-4 మూవీ కొనసాగింపుకి లీడ్‌గా ఉండబోతుందని నాని ఇప్పటికే తెలిపాడు. అయితే.. కార్తీ పేరు బయటకు వచ్చినప్పటి నుంచి మరింత క్రేజ్ ఏర్పడింది. కార్తి పోలీస్ పాత్రలకు పర్ ఫెక్ట్ అనేట్టుగా సరిపోతారు. హిట్ సిరీస్ ల్లోకి కార్తి వస్తే.. హిట్ 4 కు మరింత క్రేజ్ రావడం ఖాయం.