“కన్నప్ప” రిలీజ్ వాయిదా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 25న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రావాల్సిఉండగా..వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉన్నందున సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. త్వరలోనే కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ఆయన తెలిపారు.

భక్త కన్నప్ప ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి కాస్టింగ్ తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 25ను టార్గెట్ చేస్తూ ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. కన్నప్ప విడుదల వాయిదా సందర్భంగా ఫ్యాన్స్ కు సారీ చెబుతూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు మంచు విష్ణు.