రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న గేమ్ ఛేంజర్ ఈ నెల 10న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ వెర్సెన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే.. గేమ్ ఛేంజర్ కు కన్నడ సెగ తగిలింది. అక్కడ ఈ సినిమాకు సినీ అభిమానులు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీని కన్నడలో కాకుండా కేవలం ఇంగ్లీష్ లోనే పోస్టర్లు రిలీజ్ చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బెంగుళూరులో పలు చోట్ల గోడలకు అంటించిన సినిమా వాల్ పోస్టర్ల పై కలర్ స్పే చల్లుతూ కొందరు కన్నడిగులు నిరసన తెలిపారు. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. నిజానికి కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఉండటంతో, కన్నడ వెర్షన్ కాకుండా నేరుగా తెలుగు భాషలోనే సినిమాలను విడుదల చేస్తుంటారు. ఒకవేళ కన్నడలో డబ్బింగ్ చేసినా, స్ట్రెయిట్ తెలుగు భాషకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
ఈ చిత్రాన్నికూడా బెంగుళూరులో అధిక థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కన్నడలో ప్రమోషన్స్ చేయకపోవడం పై ఇప్పుడు నిరసలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదల తర్వాత చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన మేకర్స్.. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడలో ప్రచారం పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా కన్నడ ట్రైలర్ ను మేకర్స్ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా పార్టీ సేవ చేయడం కోసం, సంపాదన కోసం కాదు అంటూ సినిమాలోని డైలాగ్ ను కన్నడలో రాసుకొచ్చారు. మీరు ఇప్పటి వరకు చూడని అతి పెద్ద గేమ్‌లో ఉన్నారని, జనవరి 10వ తారీఖున మూవీ రిలీజ్ అవుతుందని పేర్కొంటూ కన్నడ ఫాంట్ లో టైటిల్ పోస్టర్ ను షేర్ చేశారు. దీంతో కన్నడ సెగ తగ్గచ్చు. మరి.. అక్కడ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.