వివాదంలో కన్నడ నటుడు ఉపేంద్ర

కన్నడ నటుడు ఉపేంద్ర ఓ వివాదంలో చిక్కుకున్నారు. గత శనివారం సోషల్ మీడియా లైవ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయి పోలీస్ కేసు వరకు వెళ్లాయి. గతంలో ఆయన రాజకీయ పార్టీ స్థాపించారు. తన పార్టీ యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడారు ఉపేంద్ర.

ఈ లైవ్ లో కొన్ని కులాలకు సంబంధించిన సామెతలు చెప్పారు. ఆ సామెతలు చెబుతూ ఉపేంద్ర మాట్లాడిన మాటలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించారు సదరు కుల సంఘాల నేతలు.

ఈ మేరకు బెంగళూరు పోలీసులు ఉపేంద్రపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు తన వ్యాఖ్యలపై విచారాన్ని వ్యక్తం చేశారు ఉపేంద్ర. లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు దొర్లాయని..అందుకు సారీ చెబుతున్నానని ఉపేంద్ర అన్నారు. ఇటీవల ఉపేంద్ర కబ్జా చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చారు.