సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కంగువ షూటింగ్ తాజా షెడ్యూల్ రాజమండ్రిలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో జగపతిబాబు జాయిన్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సూర్య కెరీర్ లో భారీ చిత్రంగా పది భాషల్లో నిర్మితమవుతోందీ సినిమా. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శివ కంగువను రూపొందిస్తున్నారు. 2డీ, త్రీడీ వెర్షన్స్ లో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత కంగువ టీమ్ హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ మిగతా పార్ట్ షూటింగ్ చేయబోతున్నారు. ఇటీవల సూర్య బర్త్ డేకు రిలీజ్ చేసిన కంగువ టీజర్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కంగువ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.