“కంగువ” ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి

హీరో సూర్య నటించిన కంగువ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ ఆకస్మికంగా మృతి చెందారు. కొచ్చిలో నివాసం ఉంటున్న నిషాద్ యూసుఫ్ నిన్న ఆయన ఇంట్లో అచేతనంగా పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వెళ్లి పరిశీలించి నిషాద్ మృతి చెందినట్లు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

నిషాద్ మృతితో కంగువ మూవీ టీమ్ తో పాటు చిత్ర పరిశ్రమలో విషాధం నెలకొంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేరళ సినీ కార్మిక సంఘం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. భారీ పాన్ ఇండియా మూవీగా కంగువను తీర్చిదిద్దడంలో ఎడిటర్ గా నిషాద్ ఎంతో కృషి చేశారు. ఈ సినిమా వచ్చే నెల 14న రిలీజ్ కాబోతోంది.