పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీ అంచనాలకు తగ్గట్టుగా లేదని.. ఇందులో రామాయణాన్ని పూర్తిగా మార్చేశారని విమర్శలు వచ్చాయి. అయితే.. ఆదిపురుష్ మూవీకి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సపోర్ట్ గా నిలవడం విశేషం. ఇంతకీ కంగనా ఏమన్నారంటే.. కాలం మారేకొద్దీ మనుషులు కూడా మారుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల భాష, వారి అలవాట్లు, ప్రేమ, భావోద్వేగం ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. కనీసం ఊహించగలరా అని ఇన్ స్టా గ్రామ్ లో రాసింది.
కంగనా ఈ కామెంట్స్ ఆదిపురుష్ గురించే అని.. ఈ చిత్రానికి సపోర్ట్ గా నిలిచిందని వార్తలు వస్తున్నాయి. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఆదిపురుష్ కి కంగనా సపోర్ట్ గా కామెంట్స్ చేయడంతో ఆమెకు సపోర్ట్ గా ప్రభాస ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. తన మనసులో మాటలను సూటిగా చెబుతుంటుంది కంగనా. ఇలా మరోసారి తన మనసులో మాటలను బయటపెట్టింది. మొత్తానికి డార్లింగ్ ఫ్యాన్స్ మనసు దోచుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.