తన డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ చెప్పిన కంగనా

కాంగ్రెస్ పార్టీ (Congress party) మీద విమర్శలు చేస్తూ బీజేపీ (BJP)లో చేరింది కంగనా రనౌత్ (kangana ranaut). ఇందిరాగాంధీ (Indira gandhi) ఎమర్జెన్సీ (Emergency) మీద సినిమా నిర్మించి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో ఇందిరాగాంధీగా నటించింది కంగనా. ద్వేషంతో చేసే పనులు సక్సెస్ కావు. కంగనా ఎమర్జెన్సీ సినిమాకు కూడా ఇలాగే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్ల కిందటే సినిమా రెడీ అయినా రిలీజ్ కు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.

నిర్మాతగా తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఈ సినిమా కంప్లీట్ చేసింది కంగనా. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి భాజపా ఎంపీగా గెలిచింది. ఇప్పుడు తన ఎమర్జెన్సీసినిమా రిలీజ్ కు తీసుకొస్తోంది. సెప్టెంబర్ 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కీ రోల్స్ లో నటించారు.