ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో కమల్. ఇది నిజమేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంటే… కీలక పాత్రలో అమితాబ్ నటిస్తుండడం విశేషం. ఈ సినిమాని అనౌన్స్ చేసి సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా తెర పై రాని కథాంశంతో ఈ సినిమా చేస్తుండడంతో ప్రాజెక్ట్ కే పై భారీ అంచనాలు ఉన్నాయి.

గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాలో యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ నటించనున్నారని ఓ వార్త ప్రచారంలో వచ్చింది. దీంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రచారంలో ఉన్న వార్త నిజమా..? కాదా..? అని ఆరా తీస్తే.. నిజమే అని తెలిసింది. ఇందులో కీలక పాత్ర చేసేందుకు కమల్ వెంటనే ఒప్పుకున్నారట. ఆగష్టు నుంచి కమల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దీంతో ప్రాజెక్ట్ కే పై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి.. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాతో చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.