కల్కిలో క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చిన కమల్

పాన్ వరల్డ్ మూవీ కల్కి. ప్రభాస్, దీపికా పడుకునే జంటగా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్స్ కి విమర్శలు వచ్చాయి కానీ.. ఎప్పుడైతే గ్లింప్స్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఆ విమర్శలు పోయి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్ మూవీలా అనిపిస్తుందని అనే కామంఎట్లు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇందులో కమల్ హాసన్ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆయన పాత్ర ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఆతర్వాత విలన్ పాత్ర చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఇది నిజంగా నిజమా..? లేక గ్యాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. కల్కి గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన కమల్ తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చారు. అసలు నెగిటివ్ లేకుండా పాజిటివ్ లేదు. సినిమాకి నెగిటివ్ ముఖ్యం అన్నారు. ఆవిధంగా ఆయన నెగిటివ్ రోల్ చేస్తున్నాననే విషయాన్ని బయటపెట్టారు. మరి.. కమల్ నెగిటివ్ రోల్ విశ్వరూపం చూపిస్తారేమో చూడాలి.