బింబిసార సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాడు హీరో కల్యాణ్ రామ్. డెవిల్ మూవీ మీద హోప్స్ పెట్టుకున్నా, ఆ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. మరోసారి తన ఫేవరేట్ జానర్ యాక్షన్ లోకి దిగాడు కల్యాణ్ రామ్. మదర్ సన్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యవలెంట్ యాక్షన్ డ్రామా కథతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ చేస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయశాంతి మదర్ రోల్ లో నటిస్తోంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ చూస్తే పవర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా విజయశాంతి, ఆమె కొడుకు అర్జున్ విశ్వనాథ్ గా కల్యాణ్ రామ్ కనిపించారు. తనలాగే తన కొడుకు అర్జున్ కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని కలగంటుంది వైజయంతి. విశాఖలో మాఫియాను, రౌడీలను కంట్రోల్ చేసేందుకు వైజయంతి చేసిన ప్రయతాన్ని కొనసాగిస్తాడు అర్జున్. వైజాగ్ ను పోలీసు బూట్లు, నల్లకోట్లు కాదు అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి అంటాడు. తల్లి కోరుకున్నట్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడా, లేక ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు, రౌడీయిజాన్ని ఎంచుకున్నాడా అనేది టీజర్ లో ఆసక్తిని కలిగించింది.