“కల్కి” రిలీజ్ తో పండుగ చేసుకుంటున్న ఎగ్జిబిటర్స్

ఎండలు, ఎన్నికల హడావుడి, పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ (Cinema Theatres) జనం లేక వెలవెలబోయాయి. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ను పది రోజుల పాటు బంద్ చేసే పరిస్థితి ఏర్పడింది. మళ్లీ ఆడియెన్స్ ను పెద్ద సంఖ్యలో థియేటర్స్ కు రప్పించాలంటే ఒక బిగ్ స్టార్ మూవీ రావాలని అనుకున్నారు. ఎగ్జిబిటర్స్ (Exibitors) కోరుకునే ఆ పండుగ వాతావరణాన్ని కల్కి (Kalki 2898AD) సినిమా తీసుకొచ్చింది.

ఈ రోజు రిలీజైన కల్కి సినిమాకు సకుటుంబంగా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారు. అన్ని షోస్ హౌస్ ఫుల్ బోర్డ్ లతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఏ,బీ,సీ సెంటర్స్ మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా అన్ని థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కల్కి సినిమా మార్నింగ్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీక్ కల్కి బాక్సాఫీస్ నెంబర్స్ నార్త్ తో సహా రికార్డ్ స్థాయిలో ఉండబోతున్నాయి.