సల్మాన్ ఖాన్ జోడీగా కాజల్ అగర్వాల్

సల్మాన్ ఖాన్(Salman khan) హీరోగా నటిస్తున్న సికిందర్(Sikander) సినిమాలో మరో నాయికగా ఎంపికైంది కాజల్ అగర్వాల్(Kagal agarwal). ఇప్పటికే ఈ సినిమాలో రశ్మిక మందన్న(Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా..కాజల్ అగర్వాల్ ను మరో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. తాను మొదటి రోజు సికిందర్ షూటింగ్ లో ఉన్నట్లు కాజల్ అగర్వాల్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలిపింది.

దీంతో ఇప్పటిదాకా సల్మాన్ సినిమాలో కాజల్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ నిజమేనని తేలింది. సికిందర్ సినిమాను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్నారు. సాజిద్ నడియావాలా నిర్మాత. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సికిందర్ సినిమా వచ్చే ఏడాది ఈద్ పండక్కి అంటే 2025 మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ మధ్య స్టార్స్ తో సినిమాలు తగ్గిపోయిన కాజల్ కు సల్మాన్ తో ఈ క్రేజీ బాలీవుడ్ మూవీ దక్కడం పెద్ద ఆఫరే అనుకోవచ్చు.